వైసీపీలో చేరేందుకు ప్రతిపాదనలు పంపారన్న విజయసాయి వ్యాఖ్యలకు గంటా కౌంటర్
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు గంటా కౌంటర్ ఇచ్చారు.;
వైసీపీలో చేరేందుకు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కొన్ని ప్రతిపాదనలు పంపారని.. జగన్ ఆమోదం తర్వాత పార్టీలోకి వచ్చే అవకాశం ఉందన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు గంటా కౌంటర్ ఇచ్చారు. తాను పార్టీ మారుతున్నట్లు చాలాసార్లు ప్రచారం జరిగిందని.. దాన్ని ఇప్పటికీ ఖండిస్తూనే ఉన్నానని చెప్పారు. విజయసాయి ఏ లక్ష్యంతో మాట్లాడారో అర్థం కావడం లేదన్నారు. సీఎంకు తాను ఎలాంటి ప్రతిపాదనలు పంపానో ఆయన చెప్పాలని గంటా డిమాండ్ చేశారు.