నా రాజీనామాపై వస్తున్న విమర్శలు బాధాకరం.. : గంటా శ్రీనివాసరావు
పవన్ కల్యాణ్ బీజేపీపై ఒత్తిడి తీసుకురావాలని గంటా శ్రీనివాసరావుసూచించారు.;
విశాఖ ఉక్కు కోసం 25 మంది ఎంపీలు, 175 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు. రాజీనామాలతోనే కేంద్రంపై ఒత్తిడి తీసుకురాగలమని చెప్పారు. పవన్ కల్యాణ్ బీజేపీపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు.
విశాఖ ఉక్కు తెలుగువాడి ఆత్మగౌరవమని, స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు సీఎం జగన్ బాధ్యత తీసుకోవాలని అన్నారు. ఉక్కు పోరాటంపై చంద్రబాబు సీరియస్‌గా ఉన్నారని, ఇప్పటికే ప్రధానికి లేఖ కూడా రాశారని చెప్పుకొచ్చారు.
తన రాజీనామాపై వస్తున్న విమర్శలు బాధాకరమని, స్పీకర్ స్వయంగా ఫోన్ చేసినప్పుడు కూడా తన రాజీనామాను ఆమోదించమనే చెప్పానని అన్నారు.