Minister Nara Lokesh : గుడ్ న్యూస్.. మార్చిలో డీఎస్సీ

Update: 2025-02-01 06:30 GMT

మార్చిలో డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటిస్తామని మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. హైదరాబాద్ లోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. అనంతరం ఎన్టీఆర్ భవన్లో విలేకరులతో చిట్ చాట్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే మార్చిలో డీఎస్సీ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. ఉమ్మడి ఏపీలో 80 శాతం టీచర్ నియామకం చేసింది తామేనని గుర్తు చేశారు. ఉపాధ్యాయ సంఘాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలో వారి అభిప్రాయాలు ఉంటాయన్నారు. విద్యా వ్యవస్థలో అనా లోచిత నిర్ణయాలు తీసుకోకూడదని అభిప్రాయపడ్డారు. టీచర్ల బదిలీలో పారదర్శకత కోసం ట్రాన్స్ ఫర్ యాక్ట్ తీసుకొస్తున్నట్లు తెలిపారు. విద్యాశాఖ కమిషనర్ ప్రతి శుక్రవారం టీచర్ల సమస్యలు వింటున్నారని చెప్పారు. వ్యవస్థలో భాగ స్వాములతో చర్చించాకే నిర్ణయాలు తీసుకుంటామని లోకేశ్ తెలిపారు.

Tags:    

Similar News