ఏపీలో నిరుద్యోగ యువతకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి గత నెలలో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. మొత్తం 691ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు అధికారులు. కాగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆగస్టు 5 లోగా చేసుకోవాలని అధికారులు నిర్ణయించారు. అయితే నేటితో గడువు ముగియనున్న నేపథ్యంలో గడువును పొడిగించారు అధికారులు. ఆగస్టు 10 అర్ధరాత్రి వరకు గడువును పొడిగిస్తున్నట్లు ఏపీపీఎస్సీ తన ప్రకటనలో తెలిపింది. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని https://psc.ap.gov.in సూచించింది.