నెల్లూరుకి విమానాశ్రయం ఎంతో అవసరమని...త్వరలోనే విమానాశ్రయ పనులు ప్రారంభిస్తామని శుభవార్త చెప్పారు మంత్రి నారాయణ. నెల్లూరు కలెక్టరేట్‌లో... మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కలెక్టర్‌తో కలిసి రివ్వ్యూ నిర్వహించారు. జిల్లాలోని ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న దగదర్తి ఎయిర్ పోర్ట్, రైస్ మిల్లర్లను ఇతర ప్రాంతాలకు మార్చడం వంటి అంశాలను రివ్యూలో చర్చించారు. నెల్లూరుకి విమాన మార్గం అవసరం చాలా ఉందన్నారు. ఎందుకంటే కృష్ణపట్నం పోర్ట్, ఇంకా మరికొన్ని పోర్టులు కూడా వచ్చేశాయన్నారు. వాటిలో కార్గో అనేది చాలా ముఖ్యమైందన్నారు.