Chittoor : చిత్తూరు జిల్లాలో తుపాకులు తయారు చేస్తూ పట్టుబడ్డ గ్రామ వాలంటీర్
Chittoor : చిత్తూరు జిల్లాలో ఓ వాలంటీర్ నాటు తుపాకులు తయారు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి 2 తుపాకులు, అలాగే వీటి తయారీకి ఉపయోగించే ఇతర పరికరాలను సీజ్ చేశారు.;
Chittoor : చిత్తూరు జిల్లాలో ఓ వాలంటీర్ నాటు తుపాకులు తయారు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి 2 తుపాకులు, అలాగే వీటి తయారీకి ఉపయోగించే ఇతర పరికరాలను సీజ్ చేశారు. అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటినగరం మండలం చింతతోపు ఎస్టీ కాలనీకి చెందిన రవి.. గ్రామంలో వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు.
పైకి అందరి వద్ద మంచివాడిగా నటిస్తూ ఇలా నాటు తుపాకుల తయారీకి తెర తీశాడు. వాలంటీర్ గన్స్ తయారు చేస్తున్న విషయం తెలియగానే ఇంట్లో సోదాలు చేసిన కార్వేటినగరం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. పెన్షన్లు ఎత్తుకుపోయి, అక్రమ మద్యం వ్యాపారం చేస్తూ ఇప్పటికే కొందరు వాలంటీర్లు వార్తల్లో నిలిస్తే.. ఇప్పుడీ వాలంటీర్ ఏకంగా నాటు తుపాకులు తయారు చేస్తూ పోలీసులకు దొరికాడు.
గ్రామానికి సమీపంలోనే అటవీ ప్రాంతం ఉండడంతో జంతువుల్ని వేటాడేందుకు ఈ నాటు తుపాకీలను ఉపయోగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. గతంలో కొన్న తుపాకీ పాడైపోవడంతో యూట్యూబ్‌లో చూసి ఇప్పుడు ఏకంగా తుపాకీల తయారీనే మొదలుపట్టడం విశేషం.