ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రిలో భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నగరంలో తెల్లవారుజాము నుంచి భారీ భోగి మంటలు ఏర్పాటు చేశారు. సంక్రాంతి సంస్కృతి, సంప్రదాయాల కళాకారులతో భోగి మంటల వద్ద సందడి నెలకొంది. రాజమండ్రిలోని దవళేశ్వరంలో భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నా పెద్దా అంతా కలిసి భోగి మంటలు వేశారు. సంక్రాంతి సంస్కృతి, సంప్రదాయాల ప్రతిబింభించేలా ప్రత్యేక పూజలు చేశారు. భోగి మంటల్లో ఆవు పేడతో చేసిన పిడకలు వేశారు. ఒకరికొకరు భోగి శుభాకాంక్షలు చెప్పుకుని సంతోషం గడిపారు. భోగి మంటల్లో నీళ్ల కాచుకుని.. వాటితో భోగి స్నానాలు చేశారు.