ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశభక్తి భావాలను మరింతగా పెంపొందించే లక్ష్యంతో, ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో హార్ ఘర్ తిరంగ ర్యాలీను గురువారం ఘనంగా నిర్వహించారు.500 మీటర్ల పొడవైన జాతీయ జెండాతో హోలీ క్రాస్ నుండి షార్ వై జంక్షన్ వరకు ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే నెలవాల విజయశ్రీ, ఆర్డీవో కిరణ్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, "ప్రతి ఇంటి పైభాగంలో కులమత భేదాలు లేకుండా జాతీయ జెండాను ఎగరేయడం ద్వారా దేశభక్తిని చాటి చెప్పాలి" అని పిలుపునిచ్చారు.దేశం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సైనికులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతూ, దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.