బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఆగ్నేయ బంగ్లాదేశ్ సమీపంలో కేంద్రీకృతమైన అల్పపీడనం క్రమంగా బలపడి శనివారం వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
పీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్ర డైరెక్టర్ స్టెల్లా తెలిపారు.