ఏపీలో ( Andhra Pradesh ) ఇవ్వాళ పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, వైజాగ్, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, నెల్లూరు, ప్రకాశంతో పాటు రాయలసీమలోని జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
తెలంగాణ ( Telangana ) వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతపవనాల ప్రభావంతో నేడు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
కొన్ని చోట్ల మాత్రం జల్లులు పడతాయన్నారు. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలుల కూడా వీస్తాయన్నారు. కింది స్థాయి గాలులు పశ్చిమ వాయువ్య దిశల నుంచి రాష్ట్రం వైపునకు వీస్తున్నాయని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.