బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో కాకినాడ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న సాయంత్రం నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లావ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అతలాకుతలమవుతోంది. ఇవాళ వేకువజాము నుంచి వర్షాల ప్రభావం మరింత పెరిగింది. పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. కరెంటు సరఫరా ఆగిపోయింది.
17వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాలతో విద్యాసంస్థలకు వెళ్లేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు ఈదురుగాలులు కూడా వీస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.