Prabhas: డార్లింగ్ మంచి మనసు.. ప్రభాస్ భారీ సాయం
Prabhas: ప్రభుత్వాలకు సంబంధించి ఏ విపత్తు వచ్చినా సాయం చేయడంలో ముందుంటారు సినీ సెలబ్రిటీలు.;
Prabas: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణం ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంట పొలాలతో పాటు అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి వరదల ధాటికి. వేల మంది రోడ్డున పడ్డారు. ఆవాసాలు కోల్పోయారు. నెల్లూరు, చిత్తూరు జిల్లా ప్రజల వేదన వర్ణనాతీతం. ఈ తరుణంలో ప్రభుత్వాలకు సంబంధించి ఏ విపత్తు వచ్చినా సాయం చేయడంలో ముందుంటారు సినీ సెలబ్రిటీలు.
ఇప్పటికే అల్లు అర్జున్, మహేష్ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం ప్రకటించారు. తాజాగా మరో హీరో ప్రభాస్ కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఇప్పటి వరకు సాయం అందించిన హీరోల కంటే ప్రభాస్ ప్రకటించిన విరాళం అత్యధికం కావడం విశేషం. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.
Our darling with golden heart #Prabhas donates ₹1 cr for AP CM Relief Fund. pic.twitter.com/BdT9RXwifk
— World Of Prabhas™ (@_WorldOfPrabhas) December 7, 2021