ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ ..!
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.;
AP High court (tv5news.in)
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. జగనన్న విద్యాదీవెన పథకం కింద డబ్బును తల్లుల ఖాతాలో జమ చేయాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రైవేట్ యాజమాన్యాల తరపున.. కృష్ణదేవరాయ యూనివర్సిటీ అసోసియేషన్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. ఐదే.. గతంలో ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టివేస్తూ హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది. ఆ ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు విన్పించారు. పిటిషనర్ల తరపున న్యాయవాదులు మతుకుమిల్లి శ్రీవిజయ్, వెదుల వెంకటరమణ వాదనలు విన్పించారు. ఇరు పక్షాల వాదనలు విన్న జస్టిస్ కొంగర విజయలక్ష్మి ధర్మాసనం.. ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను కొట్టివేసింది.