జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ( Pawan Kalyan ) నమోదైన కేసులో తదుపరి చర్యలు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. గతంలో గ్రామ వార్డు సచివాలయ వలంటీర్లపై పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసీపీ కేసు పెట్టిన విషయం తెలిసిందే. దీనిపై గుంటూరు కోర్టు మంగళవారం విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా పవన్ తరపు న్యాయవాదులు ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. అన్యాయంగా పవన్ పై గత ప్రభుత్వం కేసు వేసిందని హైకోర్టు దృష్టికి న్యాయవాదులు తీసుకెళ్లారు. గత ప్రభుత్వం పలువురిపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు ఇచ్చిన జీవోను ఉపసంహరించుకునే విషయాన్ని పరిశీలిస్తున్నామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు చెప్పారు. ప్రభుత్వ న్యాయవాది వాదనను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది.
కేసుపై స్టే విధిస్తూ తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.