Andhra Pradesh : కల్తీ లిక్కర్ నిందితులకు హైకోర్టు షాక్.. శిక్ష తప్పుదు..

Update: 2025-11-20 05:06 GMT

కల్తీ లిక్కర్ నిందితులకు వరుస షాకులు తగులుతున్నాయి. ఏవేవో కారణాలు చూపించి కేసు నుంచి తప్పించుకుందామని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ తప్పులు, సాక్ష్యాలు మొత్తం వారివైపే చూపిస్తున్నాయి. అందుకే కోర్టులు వారి విషయంలో చాలా కఠినంగానే ఉంటున్నాయి. అమాయక ప్రజల ప్రాణాలను కల్తీ లిక్కర్ పేరుతో తీస్తే ఎవరు ఊరుకుంటారు. అందులోనూ కోర్టులు ఊరుకుంటాయా. వైసీపీ హయాంలో ఇష్టం వచ్చినట్టు కల్తీ లిక్కర్ దందా చేసి డబ్బులు సంపాదించుకున్నారు. ఇప్పుడు అడ్డంగా దొరికిపోయేసరికి ఇష్టం వచ్చిన అబద్దాలు ఆడుతున్నారు. కానీ సిట్ అధికారులు మాత్రం వారి నుంచి నిజాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఏసీబీ కోర్టు జారీ చేసిన డీఫాల్ట్ బెయిల్ డిస్మిస్ ను తాజాగా హైకోర్టు కొట్టేసింది. కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయరెడ్డి, బాలాజీ గోవిందప్పలకు రీసెంట్ గా ఏసీబీ కోర్టు డీఫాల్ట్ బెయిల్ ఇచ్చింది. అయితే హైకోర్టు మాత్రం ఈ బెయిల్ ఇవ్వడంపై ఫుల్ సీరియస్ గా ఉంది. ఈ నెల 26లోపు సరెండర్ కావాలని కోర్టు ఆదేశించింది. కేసు నుంచి వాళ్లకు ఎలాంటి రిలీఫ్ ఉండొద్దని ఆదేశాలు జారీ చేసింది కోర్టు. దీంతో కల్తీ లిక్కర్ కేసుల్లో నిందితుల్లో భయం మొదలైంది. వారంతా ఎలాగోలా తప్పించుకుని తిరుగుదాం అని ప్లాన్ వేస్తున్నారు.

కానీ ఇలా వరస షాకులు తగులుతున్నాయి. ఈ కేసులో అసలు నిందితులను త్వరలోనే పట్టుకుంటామని సిట్ అధికారులు చెబుతున్నారు. వైసీపీ హయాంలో ఇష్టం వచ్చినట్టు కల్తీ లిక్కర్ ను తయారు చేసి ప్రజలతో తాగించారు. వారి ఆరోగ్యాలను దెబ్బ తీశారు. ఇది తాగి చాలా మంది చనిపోయారు కూడా. కానీ వైసీపీ నేతలకు అవేమీ పట్టవు కదా. తమ సొమ్ము తమకు వస్తే చాలు అన్నట్టు ప్రవర్తించారు. ఇప్పుడు నిజాలు బయటపడేసరికి ఎలా తప్పించుకుందామా అని చూస్తున్నారు.


Full View

Tags:    

Similar News