DC: మండిపోతున్న ఎండలు

మరో రెండు రోజులు జాగ్రత్తగా ఉండాలన్న వాతవరణ అధికారులు;

Update: 2025-03-15 05:00 GMT

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. పది రోజులుగా సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ప్రజలను బేంబెలెత్తిస్తున్నాయి. మధ్యాహ్నం వేళ ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉక్కపోత వేధిస్తోంది. హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీలో లో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. కర్నూలులో అత్యధికంగా 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని అధికారులు తెలిపారు. తుని, కావలి, నంద్యాల, కర్నూలు వంటి ప్రాంతాల్లోనూ సాధారణాన్ని మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణ శాఖ ప్రకారం.. రాయలసీమ, కోస్తాంధ్రలో నేడు, రేపు పలు ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది. పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశముండటంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

హైదరాబాద్‌లో...

గ్రేటర్ సిటీలో నాలుగు రోజులు ఎండల తీవ్రత ఎక్కువగా ఉండబోతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 15 నుంచి 18 వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చార్మినార్, ఖైరతాబాద్, కూకట్ పల్లి, ఎల్బీనగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి, వికారాబాద్, మేడ్చల్ , రంగారెడ్డి సహా అన్ని జోన్లలో ఇదే తరహా వాతావరణం ఉండబోతుందన్నారు. 19 వరకు వడగాల్పులు కొనసాగుతాయన్నారు.

Tags:    

Similar News