Telugu States : నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు

Update: 2024-04-05 06:10 GMT

నేడు, రేపు భానుడు ఉగ్రరూపం దాల్చనున్నాడు. విపత్తుల నిర్వహణ సంస్థ అంచనాల ప్రకారం ఏపీలో (AP)  కొన్ని చోట్ల 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అనంతపురం(D)లో 41 నుంచి 43 డిగ్రీలు, పల్నాడు, NTR జిల్లాల్లో 41-44, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కాకినాడ, తూ.గో జిల్లాల్లో 41-45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయి. నిన్న నంద్యాల(D) చాగలమర్రిలో గరిష్ఠంగా 44.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

మరోవైపు తెలంగాణలో (Telangana) ఇవాళ, రేపు వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 డిగ్రీలు అధికంగా నమోదవుతాయని తెలిపింది. ఉ.11 నుంచి మ.3 వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ఆ సమయంలో వృద్ధులు, పిల్లలు బయటకు రావొద్దని సూచించింది. నిన్న నల్గొండ(D) ఇబ్రహీంపేటలో అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని, 2016 తర్వాత ఈ ఏడాదే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని పేర్కొంది.

Full View

Tags:    

Similar News