నాపై పెట్టిన కేసుల అంశాన్ని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్తా : ఎంపీ రఘురామ
పోలీసులు తనపై పెట్టిన కేసుల అంశాన్ని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్తానని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు.;
పోలీసులు తనపై పెట్టిన కేసుల అంశాన్ని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్తానని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా విచారణ జరిపించాలని కోరుతానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వమే కుట్రలో భాగస్వామ్యం అయినప్పుడు... వారి నుంచే నివేదిక తీసుకోవడం తగదని అన్నారు. ఓ ఎంపీపైనే ఇన్ని కేసులు పెడితే... సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని రఘురామ ప్రశ్నించారు. కేసుల వ్యవహారం వెనుక ఉన్న సీఎం జగన్ ఉన్నారని ఆరోపించారు.