AP : ఏపి సీఎం అదనపు కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రా

Update: 2024-07-01 07:57 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు ( CM Chandrababu ) అదనపు కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రాను ( Karthikeya Mishra ) నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖలో ఆయన డైరెక్టర్ గా పని చేస్తున్నారు.

సీఎంవోలోకి సీనియర్ ఐఏఎస్ అధికారులను తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కార్తికేయ మిశ్రాను రాష్ట్ర సర్వీస్ కు పంపాలని కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. దీనిపై స్పందించిన డీవోపీటి మిశ్రాను ఏపీ క్యాడర్ కు పంపుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.

Tags:    

Similar News