Chandrababu Naidu : టెక్నాలజీ గురించి నేను మాట్లాడితే తప్పుపట్టారు : చంద్రబాబు

Update: 2025-01-17 07:30 GMT

పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడి అని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టును గోదావరిలో కలిపేశారని వ్యాఖ్యానించారు. అదే సమయంలో అమరావతిని కూడా భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరైనా వెనుకాడే పరిస్థితి నెలకొందని తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో మీడియా సమావేశంలో ఈ కామెంట్స్ చేశారు చంద్రబాబు. గతంలో తాను టెక్నాలజీ గురించి, ఐటీ గురించి మాట్లాడితే అవహేళన చేశారని, కానీ ఇవాళ అదే టెక్నాలజీ తిండి పెట్టడం కాదు... మనుషులను ఎక్కడికో తీసుకెళుతోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇప్పటిరోజుల్లో సెల్ ఫోన్ లేకుండా ఉండలేని పరిస్థితి నెలకొందని అన్నారు. 

Tags:    

Similar News