వైసీపీ చీఫ్ జగన్ గతంలో మనిషిని.. ఇప్పుడు మామిడి కాయలను తొక్కించారని మంత్రి నాదేండ్ల మనోహర్ విమర్శించారు. ధాన్యం కల్లాల్లోకి చెప్పులు లేకుండా వెళ్లడం సంప్రదాయమని చెప్పారు. కానీ దొంగచాటుగా మామిడి కాయలు తెచ్చి రోడ్డుపై వేసి తొక్కించటం వైసీపీ సంప్రదామని మండిపడ్డారు. కేవలం ఫొటోలు, వీడియోల కోసం పండ్లను తొక్కించడం దుర్మార్గమన్నారు. రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. 2024-25లో ధాన్యం డబ్బులను రైతుల ఖాతాల్లోకి జమచేశామని.. ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని చెప్పారు. రైతు సమస్యలపై దమ్ముంటే జగన్ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ప్రభుత్వాన్ని జగన్ బెదిరించడం సరికాదన్నారు. లా అండ్ ఆర్డర్ కు విఘాతం కలిగిస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.