విశాఖలో నిషేధిత మాదకద్రవ్యాలు కలకలం రేపుతున్నాయి. ఏళ్ళ చరిత్ర కలిగిన విశ్వవిద్యాలం ఆంధ్రయూనివర్సిటీని అడ్డాగా చేసుకుని డ్రగ్స్ రాకెట్ నడుస్తున్నట్లు పెద్దఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నా ఆర్ధిక రాజధానిగా ఇప్పుడిప్పుడే రూపాంతరం చెందుతున్న విశాఖలో లక్షల రూపాయలు విలువల చేసే నిషేధిత కొకైన్ పట్టుబడడంతో నగర వాసులు ఉలిక్కిపడుతున్నారు. పొరుగు రాష్ట్రాలైన ఢిల్లీ బెంగళూరు వంటి నగరాలను ప్రధాన కేంద్రాలుగా చేసుకుని అక్కడి నుండి విమానాల ద్వారా ఎయిర్ పోర్టుల వద్ద కట్టుదిట్టమైన భద్రతను దాటుకుని మరి నగరంలోకి నిషేధిత మత్తు పదార్ధం మాదకద్రవ్యాలు కొరియర్ ద్వారా దిగుమతి జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించడం మరింత విస్మయానికి గురిచేస్తోంది. ఇటీవల వివిధ కళాశాలలు రద్దీగా ఉండే ప్రధాన కూడళ్ళుతో పాటు విశాఖ సాగర తీరం వంటి ప్రాంతాల్లో యువత మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలని కోరుతూ చేపట్టిన అంతర్జాతీయ మాధకద్రవ్యాల నిర్ములన దినోత్సవ వేడుకలు జరిపి కనీసం నెల రోజులైనా గడవక ముందే ఎక్కడిక్కక్కడ ఇబ్బడి ముబ్బడిగా పట్టుబడుతున్న గంజాయితో పాటు ఇప్పుడు కొకైనా హెరియన్ వంటి మాదకద్రవ్యాలు పోలీసులు గుర్తించడంతో నగర వాసులు ఆందోళన చెందుతున్నారు.