గిద్దలూరులో అమానవీయ ఘటన.. బకెట్‌లో నవజాత శిశువు

Update: 2025-09-23 12:34 GMT

ప్రకాశం జిల్లాలోని గిద్దలూరులో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన ఒక మగ శిశువును ఓ తల్లి బకెట్‌లో వదిలిపెట్టి వెళ్లిపోయింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సోమవారం అర్ధరాత్రి ఒక గర్భిణి ప్రసవం కోసం గిద్దలూరులోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి వచ్చింది. అయితే ఆ సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఆస్పత్రిలోని వాష్‌రూమ్ వద్ద ఆమెకు ప్రసవం అయింది. పుట్టిన మగ శిశువును అక్కడే ఉన్న ఒక బకెట్‌లో వదిలిపెట్టి ఆమె వెళ్లిపోయింది.

కొంతసేపటికి శిశువు ఏడుపు వినిపించడంతో ఆస్పత్రి సిబ్బంది అక్కడికి చేరుకుని చూశారు. బకెట్‌లో ఉన్న నవజాత శిశువును గమనించి వెంటనే స్పందించారు. శిశువును మరో ప్రైవేటు ఆస్పత్రికి తరలించి అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ బాలింతను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Tags:    

Similar News