Jagan-Raghurama:: అసెంబ్లీలో జగన్, రఘురామ మధ్య ఆసక్తికర సంభాషణ
జగన్‌ను పలకరించిన ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు;
ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన వెంటనే ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగం అనంతరం శాసనసభ రేపటికి వాయిదా పడింది. ఇదిలా ఉంటే.. ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు మాజీ సీఎం జగన్ వద్దకు వెళ్లి పలకరించారు. హాయ్ జగన్.. అంటూ జగన్ కూర్చున్న సీటు వద్దకు వెళ్లి పలకరించారు. ఈ సమావేశాలు జరిగినన్న రోజు అసెంబ్లీకి రావాలని జగన్‌ను కోరారు. ఈ క్రమంలోనే హాజరవుతానని జగన్ బదులిచ్చారు. కొన్ని నిమిషాల పాటు ఆసక్తికర చర్చ జరిగింది.
అనంతరం జగన్‌తో జరిగిన సంభాషణ వివరాలను ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు మీడియాతో పంచుకున్నారు. అసెంబ్లీ హాల్‌లో జగన్ తన భుజంపై 2సార్లు చేయి వేసి మాట్లాడారని చెప్పారు. కనిపించిన వెంటనే హాయ్ అని జగన్ పలకరించారని పేర్కొన్నారు. రోజూ అసెంబ్లీకి రావాలని తాను జగన్‌ను కోరానని.. రెగ్యులర్‌గా వస్తాను.. మీరే చూస్తారుగా అని జగన్ చెప్పారని రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు. తనకు జగన్ ప్రక్కనే సీట్ వేయించాలని పయ్యావుల కేశవ్‌ను కోరినట్లు రఘురామ కృష్ణ రాజు తెలిపారు. తప్పని సరిగా అంటూ లాబీల్లో నవ్వుకుంటూ శాసనసభ వ్యవహారాల మంత్రి కేశవ్ వెళ్లినట్లు తెలిసింది.