ఏపీలో కూటమి హయాంలో వరుసగా పెట్టుబడులు వస్తున్నాయి. వస్తున్న పెట్టుబడులను ఒక్క ప్రాంతానికి పరిమితం చేయకుండా అన్ని ప్రాంతాలకు విస్తరించేలా చేస్తోంది కూటమి ప్రభుత్వం. వైసీపీ హయాంలో మూడు రాజధానుల పేరుతో టైమ్ పాస్ చేసింది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాత్రం మాటలు చెప్పకుండా చేతల్లో చేసి చూపిస్తోంది. ఓ వైపు రాయలసీమలో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలను తీసుకొస్తోంది. ఇంకోవైపు విశాఖలో డిజిటల్, టెక్ కంపెనీలను తీసుకొస్తోంది. మధ్యలో ఉన్న అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేస్తోంది. ఇలా అన్ని ప్రాంతాలకు అభివృద్ధిని పరిచయం చేస్తోంది కూటమి.
నిన్న డేటా సెంటర్ ప్రారంభ కార్యక్రమంలో నారా లోకేష్ మాట్లాడుతూ కొన్ని కీలక ప్రకటనలు చేశారు. ఏపీకి కూటమి హయాంలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామన్నారు. ఏపీకి విశాఖ ఆర్థిక రాజధాని అంటూ తేల్చి చెప్పారు. విశాఖకు అంతర్జాతీయ స్థాయి కంపెనీలైన మెటా కేబుల్ సెంటర్, గూగుల్ డేటా సెంటర్, టీసీఎస్ లాంటి కంపెనీలను తీసుకురావడం అంటే మాటలు కాదు. ప్రపంచంలోనే ఎక్కడా చూడని అతిపెద్ద డేటా సెంటర్లు ఇప్పుడు విశాఖలో చూడబోతున్నాం. మూడు డేటా సెంటర్లు విశాఖకు వస్తున్నాయని లోకేష్ స్వయంగా తెలిపారు.
రాయలసీమలో మాన్యుఫ్చాక్చరింగ్ కంపెనీలు ఇప్పటికే చాలా వచ్చాయి. అందులో కొన్ని ప్రారంభం కూడా అయ్యాయి. రాయలసీమ గతంలో ఎన్నడూ చూడని పెట్టుబడులు ఇప్పుడు కూటమి హయాంలో వస్తున్నాయి. అందుకే ఏపీ అభివృద్ధి చెందడానికి పదేళ్ల కంటే ఎక్కువ అవసరం లేదని లోకేష్ ప్రకటన చేశారు. త్వరలోనే ఢిల్లీలో సంచలన ప్రకటన ఉంటుందని తెలిపారు. బహుషా అది గూగుల్ డేటా సెంటర్ కు సంబంధించిందే కావచ్చు. ఇన్న రకాల అభివృద్ధి పనులు చేస్తూనే సంక్షేమాన్ని అస్సలు ఆపట్లేదు. ఏపీ ప్రజల ఆర్థిక పరిస్థితిని మెరుగు పర్చేందుకు సంక్షేమాన్ని అందిస్తూనే.. ఇంకోవైపు పెట్టుబడులు తీసుకొచ్చి ఏపీ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్నారు.