ఎక్కడ ఏం జరిగినా సరే దాన్ని డైవర్ట్ చేయడంలో వైసిపి తర్వాతే ఎవరైనా. వాళ్లకు అనుకూలంగా ఉంటే దాన్ని రెండింతలు చేసి చెబుతారు. ఒకవేళ వాళ్లకు అది వ్యతిరేకంగా ఉంటే పూర్తిగా మార్చేసి తప్పుడు ప్రచారాలు చేసి కూటమిపై బురద జల్లడానికి విశ్వ ప్రయత్నాలు చేయడంలో వైసిపి తర్వాతే ఎవరైనా. ఇప్పుడు పరకామణి కేసులో కీలక సాక్షి అయిన సతీష్ కుమార్ మృతి ఏపీలో ఒక సంచలనం. అయితే సతీష్ కుమార్ ఎలా చనిపోయాడో ఇంకా ఎవరికీ తెలియక ముందే.. వైసీపీ నేతలు రకరకాల తప్పుడు ప్రచారం స్టార్ట్ చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ సతీష్ కుమార్ ది ఆత్మహత్య అని.. పోలీసుల వేధింపుల వల్లే అతను చనిపోయాడు అంటూ చెప్పారు.
అందరికంటే ముందే ఈ విషయం కరుణాకర్ రెడ్డి కి ఎలా తెలుసు. కనీసం సాక్షాలు కూడా బయటకు రాలేదు కదా. సతీష్ ఒంటిమీద గాయాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్నారు. అలాంటప్పుడు భూమన దీన్ని ఆత్మహత్య అని ఎలా చెబుతారు. మీడియాను ప్రజలను ఎందుకు ఇలా తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇలా ఏది పడితే అది చెప్పడానికి కనీసం సిగ్గుగా లేదా. పరకామణి కేసులో వైసిపి పెద్ద నేతలు ఉన్నట్లు ఇప్పటికే చాలా ఆరోపణలు ఉన్నాయి.
సతీష్ కుమార్ సిటు ముందు వాంగ్మూలం ఇస్తే వాళ్ల పేర్లు ఎక్కడకి బయటకు వస్తాయో అని ఆ పెద్ద నేతలు లేపేసినట్టు ఇప్పుడు కొత్త ఆరోపణలు బయటకు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో భూమన కరుణాకర్ రెడ్డి ఆత్మహత్య అని ఎలా ప్రకటిస్తారు. ఆయనకు కనీస సమాచారం కూడా లేక ముందే కేసును తప్పుదోవ పట్టించేందుకు ఎందుకు ఇలా ప్రయత్నిస్తున్నారు. అతనే కాదు వైసిపి నేతలు చాలామంది సతీష్ విషయంలో ఇలాంటి తప్పుడు ప్రచారమే మొదలుపెట్టేశారు. ప్రస్తుతం పోస్టుమార్టం రిపోర్ట్ పై విచారణ జరుగుతుంది. అది బయటకు వస్తే అసలు నిజం ఏంటనేది తేలిపోతుంది కదా.