కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో మాజీ సీఎం జగన్ పర్యటించారు. ఈ పర్యటనలో మరోసారి జగన్ కాన్వాయ్ ఒకదానికొకటి ఢీకొనడం కలకలం రేపింది. ఉయ్యూరు మండలం గండిగుంట వద్ద కాన్వాయ్ వాహనాలు ఒక దాని కొకటి ఢీకొన్నాయి. దీంతో పలువురికి గాయాలు అయ్యాయి. ఈ మేరకు రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి.. వాహనాలు నిలిచిపోయాయి. ఎంత మెుర పెట్టుకుంటున్నా వినకుండా.. జగన్ కాన్వాయ్ ఇష్టం వచ్చినట్లు ముందుకు సాగిందని పోలీసులు ఆరోపిస్తున్నారు. వైసీపీ నేతల అత్యుత్సాహం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని స్థానికులు దుమ్మెత్తి పోస్తున్నారు. అనంతరం పోలీసులు పరిస్థితి చక్కదిద్దారు.
వైఎస్ జగన్ గత పర్యటనల్లోనూ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో సింగయ్య అనే వ్యక్తి ప్రమాదంలో చనిపోవటం అప్పట్లో రాజకీయంగా వివాదానికి కారణమైంది. వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో చీలి సింగయ్య అనే వ్యక్తి జగన్ కారు కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై అప్పట్లో కూటమి ప్రభుత్వం, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధాలు జరిగాయి.