కొన్ని రోజులుగా మాజీ సీఎం జగన్ తీరు గమనిస్తే ఒకే తరహాలో వ్యవహరిస్తున్నారు. ఓడిపోయినప్పటి నుండి బెంగళూరు ప్యాలెస్ లో ఉంటున్న మాజీ సీఎం జగన్ అప్పుడప్పుడు ఏపీకి వచ్చి కొన్ని ప్రెస్ మీట్ లు పెడుతున్నారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి ఏదో ఒక విషయం మీద వివాదాస్పద వ్యాఖ్యలు లేదా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. వైసిపి ఇమేజ్ డ్యామేజ్ అవుతున్న ప్రతిసారి ఆయన ఇలాగే చేస్తున్నాడు. ఆ మధ్య ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి పరాకామణి చోరీ కేసు చాలా చిన్నదని.. కేవలం 70000 దొంగతనం జరిగితే.. దానికి బదులుగా తాము కోట్లాది రూపాయలు టీటీడీకి రాయించామని వాళ్ల తప్పులను సమర్ధించుకున్నాడు మాజీ సీఎం జగన్. అలాగే మెడికల్ కాలేజీల విషయంలోనూ ఇలాగే ఒకసారి బెంగళూరు నుంచి వచ్చే ప్రెస్ మీట్ పెట్టాడు. పిపీపీ విధానంలో పెట్టుబడులు పెడుతున్న కార్పొరేట్ కంపెనీలను తాను అధికారంలోకి వచ్చిన వెంటనే జైల్లో వేస్తానంటూ బెదిరించాడు.
ప్రజలకు ఎంతో ఉపయోగపడే ఈ విధానంలో పెట్టుబడులు రాకుండా అడ్డుకున్నానని పైశాచిక ఆనందాన్ని ప్రవర్తించారు వైసిపి నేతలు. ఆ తర్వాత మళ్లీ ఫ్లైట్ ఎక్కి బెంగళూరు ప్యాలెస్ కు వెళ్లిపోయాడు జగన్. ఇప్పుడు మళ్లీ ఏపీకి వచ్చిన వైసీపీ అధినేత.. ఈసారి అమరావతి మీద పడ్డాడు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు అమరావతి రాజధాని లేదంటూ మూడు రాజధానులు అంటూ అక్కడి ప్రజలను నానా ఇబ్బందులు పెట్టాడు. ప్రజలు ఓడగొడితే జగన్ కు అమరావతి రాజధానిగా ఉండటంలో ఎలాంటి అభ్యంతరం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా చెప్పించాడు. కానీ అది ఉత్తమాటే అని మరోసారి నిరూపించాడు జగన్. రీసెంట్ గా మీడియాతో మాట్లాడుతూ అమరావతి అనే రాజధాని అసలే లేదని.. నదిగర్భంలో నిర్మాణాలు ఎలా చేపడుతారు అంటూ సెటైర్లు వేశారు.
అమరావతి నిండా మునిగిపోతుందని.. దాన్ని పూర్తి చేయాలంటే 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తీసుకువస్తారు అంటూ తన కుట్రలను బయటపెట్టాడు జగన్. దీంతో జగన్ తీరుపై ఏపీవ్యాప్తంగా ప్రజలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీకి మంచి జరుగుతుంటే జగన్ ఓర్చుకోలేకపోతున్నాడని అందుకే ఇలా ప్రెస్ మీట్ లు పెట్టి విషప్రచారం చేస్తున్నాడంటూ తిట్టిపోస్తున్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే వాళ్లకు వస్తున్న పేరును చూసి తట్టుకోలేక ఇలాంటి విష ప్రచారాలు చేస్తున్నాడని మండిపడుతున్నారు ప్రజలు. జగన్ ఇలాగే వ్యవహరిస్తే ఇప్పుడు వచ్చిన 11 సీట్లు కూడా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రావు అంటూ కూటమినేతలు వార్నింగులు ఇస్తున్నారు.