అన్న జగన్ పై వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ప్రభాస్‌తో తనకు సంబంధం ఉన్నట్లు జగనే ప్రచారం చేయించారని షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభాస్ ఎవరో తనకు తెలియదన్నారు. అప్పుడు నా పిల్లల మీద ప్రమాణం చేశా.. ఇప్పుడు ప్రమాణం చేస్తున్నా.. ప్రభాస్‌తో ఎలాంటి రిలేషన్ లేదు అని షర్మిల చెప్పారు. ప్రభాస్ తో తనకు సంబంధం కలుపుతూ ప్రచారం జరుగుతున్నప్పుడు జగన్ ఏం చేశారని ప్రశ్నించారు. బాలకృష్ణపై జగన్ చేసిన ఆరోపణలను ఖండించారు షర్మిల. జగన్ పై షర్మిల చేసిన కామెంట్లపై చర్చ జోరందుకుంది.