YS Jagan : దిగజారిపోతున్న జగన్.. అధికారులంటే లెక్క లేదా.

Update: 2025-12-11 07:15 GMT

మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారం పోయినప్పటి నుంచి చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అవతలివారికి కనీస గౌరవం ఇవ్వకుండా తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అవతల వాళ్ళ పొజీషన్ ఏంటి, వాళ్లు ఏ స్థాయి వ్యక్తులు, వాళ్లకు ప్రజల్లో ఉన్న గౌరవం ఏంటి అనేది కూడా మర్చిపోయి.. తాను ఒక మాజీ సీఎంను ఇలా మాట్లాడొద్దు అనే కామన్ సెన్స్ లేకుండా ఇష్టం వచ్చినట్టు అనేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వంలో పీసీపీ చైర్మన్ గా ఉన్న కృష్ణయ్యను, ఆయన అల్లుడు డీఐజీ రేంజ్ అధికారి తిరుమల విజిలెన్స్ ఆఫీసర్ గా పనిచేసిన గోపీనాథ్ జెట్టిని పట్టుకుని "వాడు.. వాడి అల్లుడు వీడు"అంటూ జగన్ అహంకారపూరితంగా మాట్లాడారు. అంటే బీసీల మీద జగన్ చూపించే ప్రేమ అంతా ఉట్టిదే అన్నమాట. అదే బీసీ అధికారుల మీద ఇంత దారుణంగా మాట్లాడటం ఏంటి మరి.

తన పార్టీలో ఎక్కువగా బీసీలకు, మైనార్టీలకు, షెడ్యూల్డ్ కులాలకే ఎక్కువ టికెట్లు, పదవులు ఇస్తున్నాను అని చెప్పే జగన్.. వాళ్లకు కనీస గౌరవం కూడా ఇవ్వట్లేదు. అంటే పైకి చెప్పేది ఒక మాట ఆయన మనసులో ఉన్నది మాత్రం వేరే అన్నమాట. వీరినే కాకుండా భువనేశ్వరి గారిని పట్టుకొని.. ఏకవచనంతో మాట్లాడటం ఏంటి. ఆమె సీనియర్ ఎన్టీఆర్ కూతురు, నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారి సతీమణి. అంతటి స్థాయి, గౌరవం ఉన్న భువనేశ్వరి గారిని ప్రపంచంలో ఎవరూ కూడా ఏకవచనంతో మాట్లాడరు. కానీ జగన్ మాత్రం భువనేశ్వరి గారిని ఏకవచనంతో మాట్లాడుతూ తన అసలు రూపాన్ని బయటపెట్టారు. మహిళలు, పెద్ద ఆఫీసర్లు అనే కనీస గౌరవం కూడా జగన్ కు లేదు.

ఒక సీఎంగా పని చేసిన వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలు ఇవి కానే కావు. సీఎం కుర్చీలో కూర్చున్న వ్యక్తులు ఎంతటి స్థాయి వ్యక్తులనైనా కచ్చితంగా గౌరవించాల్సిందే. తమ కంటే తక్కువ స్థాయి వాళ్లను అయినా, ఆర్థికంగా తమ కంటే తక్కువ పొజిషన్లో ఉన్నవారినైనా, తక్కువ ఏజ్ వాళ్ళు అయినా సరే కచ్చితంగా గౌరవించాలి. అప్పుడే వాళ్ల మాటలకు గౌరవం ఏర్పడుతుంది. కానీ జగన్ ఇలా దిగజారిపోయి మాట్లాడుతూ తన స్థాయిని తానే తగ్గించుకుంటున్నాడు. ఇలాంటి అహంకారం చూపిస్తేనే ఏపీ ప్రజలు అత్యంత దారుణంగా ఒడగొట్టారు. మళ్లీ అదే ప్రవర్తనను చూపిస్తే ఏపీలో వైసీపీ అనేది కనిపించకుండా పోవడం ఖాయం అంటున్నారు కూటమినేతలు.

Tags:    

Similar News