YS Jagan : కోర్టుకు ర్యాలీతో ఎందుకు జగన్..?

Update: 2025-11-20 09:45 GMT

మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా సరే అందులో పెద్ద హడావిడి ఉండాలని ప్లాన్ చేసుకుంటాడు. ఆయన ఎక్కడికి వెళ్లినా సరే ఆయన చుట్టూ వేలాది మంది రావాలని ఓ పెద్ద స్కెచ్ వేసి స్క్రిప్ట్ రాసుకొని అమలు చేస్తుంటాడు. మామిడి రైతులను పరామర్శించడానికి వెళ్లినా సరే.. తుఫాన్ బాధితులను పరామర్శించడానికి వెళ్లినా, గుంటూరు మిర్చి రైతులను పరామర్శించడానికి వెళ్లినా.. చివరకు ఎవరైనా చనిపోతే అక్కడకు కూడా తన చుట్టూ వందల వేల మంది రావాలని కోరుకుంటాడు. ఇలా ప్రతిసారి హడావిడి చేయడంతో ఎన్ని తొక్కిసలాటలు జరిగాయో కూడా చూశాం.

ఇప్పుడు చివరకు కోర్టుకు వెళ్లినా సరే బల ప్రదర్శన చూపించుకోవాలని అనుకున్నాడు. హైదరాబాద్ లో కూడా తనకు ఏ మాత్రం పట్టు తగ్గలేదని తనకు భారీ ఫాలోయింగ్ ఉందని నిరూపించుకోవడానికి పెయిడ్ కార్యకర్తలను తీసుకువచ్చి నానా హైరానా చేశాడు. అక్రమాస్తుల కేసుల్లో కోర్టులో హాజరు కావడానికి ర్యాలీగా రావడం ఏంటి అసలు. ఆయనేమన్నా సంఘసేవ చేయడానికి వెళుతున్నాడా. లేదంటే ఎక్కడైనా పోరాటానికి వెళ్తున్నాడా. కోర్టులో హాజరు కావడానికి ఇంత బిల్డప్ ఏంటని ఆయన హడావిడి చూసిన ప్రజలు అనుకుంటున్నారు.

ఈరోజు జగన్ షెడ్యూల్ చూస్తే ఆయన ఏ టైంలో ఎక్కడకు వెళ్తారు ఆ తర్వాత ఎవరిని కలుస్తారు అనేది రిలీజ్ చేసింది వైసిపి పార్టీ. మరి దారుణమేంటంటే ఆయన కోర్టుకు ఇచ్చే టైమును కూడా అందులో మెన్షన్ చేశారు. అసలు కోర్టు ఆయనకు టైం ఇస్తుందా లేదంటే ఆయన కోర్టుకు టైం ఇస్తుందా.. నేను ఈ టైం కి వస్తాను ఈ టైం కి ఇక్కడ ఉంటాను అని షెడ్యూల్ ఇవ్వడమేంటి. కోర్టులో ఏ టైం అయినా ఎంతవరకు అయినా వేచి చూడాలి కదా. అలాకాకుండా అక్కడికి ఆయన ఏదో పెద్ద స్వాతంత్ర సమరయోధ పోరాటాలు చేసిన వాడిలా బిల్డప్ ఇవ్వడమేంటి అని కూటమినేతలు ప్రశ్నిస్తున్నారు.


Full View

Tags:    

Similar News