జగన్ దీపావళి స్టంట్ ఫెయిల్.. ప్రతిసారీ ఇంతేనా..

Update: 2025-10-22 15:18 GMT

మాజీ సీఎం జగన్ వేసిన దీపావళి స్కిట్ ఫెయిల్ అయిపోయింది. ఏదో పీఆర్ స్టంట్ లాగా హిందువులను మభ్యపెట్టేందుకు చేసిన దీపావళి స్క్రిప్ట్ అంత బాగా వర్కౌట్ కాలేదు. ఏదో పండుగ పూట తాను హిందూ పండుగలను గౌరవిస్తాను.. వాటిని ఘనంగా జరుపుకుంటాను అని నమ్మించేందుకు బలవంతంగా బెంగుళూరు ప్యాలెస్ లో జగన్, భారతి రెడ్డి రెండు సిచ్చుబుడ్లు, రెండు కాకర పుల్లలు పేల్చారు. కానీ అందులో ఎక్కడా మనస్ఫూర్తిగా చేసినట్టు కనిపించలేదు. భక్తి అసలే లేదు. వాస్తవానికి దీపావళి పండుగ అంటే లక్ష్మీదేవిని పూజించాలి. హిందువులు అందరూ చేసేది అదే కూడా. కానీ జగన్ ఆ విషయమే పట్టించుకోలేదు.

వాస్తవానికి జగన్ 15 రోజుల పాటు లండన్ వెళ్లిపోయాడు. గడువు ముగియడంతో బెంగుళూరులో దిగాడు. అదే టైమ్ కు దీపావళి రావడంతో పనిలో పనిగా ఓ స్కిట్ ప్లాన్ చేశారు. కానీ అందులో ఎక్కడా ఆడంభరం కనిపించలేదు. కేవలం వైసీపీ మీడియాకు, సోషల్ మీడియాకు అదో పెద్ద సందడిలాగా అనిపించింది. ఇంకేముంది వైసీపీ పెద్ద ఎత్తున దాన్ని వైరల్ చేసుకుంది. కానీ ఇదే జగన్ దసరాకు ఎందుకు పండుగ జరుపుకోలేదు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు తిరుపతి బ్రహ్మోత్సవాలకు ఎందుకు వెళ్లలేదు. ఎందుకు పట్టువస్త్రాలు సమర్పించలేదు. కనకదుర్గమ్మ ఆలయానికి ఎందుకు వెళ్లలేదు.

ఎంతసేపు తాడేపల్లి ప్యాలెస్ లో గుడుల సెట్లు వేయడం, దేవుళ్ల విగ్రహాలు తెప్పించుకుని పూజలు చేస్తున్నట్టు మీడియా కవరేజీలు ఇవ్వడం.. అంతే తప్ప అంతకు మించి హిందువుల పండుగ మీద ప్రేమ ఎక్కడా కనిపించలేదు. సీఎంగా ఉన్న వాళ్లు ఇఫ్తార్ విందులో, హిందువుల పండుగలు జరిగే చోట్లకు వెళ్తుంటారు. కానీ జగన్ అలా ఎక్కడా కూడా హిందువుల ఆలయాల బ్రహ్మోత్సవాలకు వెళ్లరు. కేవలం హిందువుల ఓట్ల కోసమే ఇలాంటి స్కిట్లు, స్క్రిప్టులు ప్లాన్ చేస్తుంటారు. ఇప్పుడు దీపావళికి ఏవో రెండు కాకరపుల్లలు పేల్చేసి బాగానే ఫోజులు ఇచ్చారు. కానీ ఇలా ఆర్టిఫిషియల్ గా చేస్తే జనాలు నమ్మరు. గౌరవంతో, భక్తితో చేస్తేనే ప్రజలు నమ్ముతారు. జగన్ ఈ విషయాన్ని గ్రహించాలి.


Full View

Tags:    

Similar News