YS Sharmila vs YS Jagan : పొలిటికల్ మర్డర్ అంటూ జగన్ కలరింగ్.. షర్మిల సెటైర్లు
అన్న జగన్ పై చెల్లెలు వైఎస్ షర్మిల మరోసారి తనదైన శైలిలో పొలిటికల్ విసుర్లు విసిరారు. జగన్ హత్యా రాజకీయాలు చేశారని.. గొడ్డలి రాజకీయాలు చేశారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు.
వివేకా బాబాయిని హత్య చేసిన వాళ్ళతో భుజాలు రాసుకొని తిరిగి.. సొంత చెల్లెల్లకు వెన్నుపోటు పొడిచారన్నారు. "హోదా మీద బీజేపీ మోసం చేస్తే ఒక్క రోజు ధర్నా చేయలేదు? ప్రత్యేక హోదా కావాలని ధర్నా చేయలేదు? మీ పాలనలో ఎన్ని సార్లు ధర్నాలు చేశారు. హోదా అనే అంశం ఊసే లేకుండా చేశారు. పోలవరం మీద పట్టింపు లేదు.. మూడు రాజధానులకు దిక్కు లేదు.. కార్యకర్త హత్య మీద ఇప్పుడు ఢిల్లీ ధర్నా అంటున్నారు. బీజేపీ నిర్లక్ష్యం మీద ఒక్క రోజు చేయలేదు.. వినుకొండ మర్డర్ రాజకీయం కాదు.. వ్యక్తిగత హత్య" అని షర్మిల తెలిపారు.
తమ విచారణలో వ్యక్తిగత హత్య అని తెలిసిందనీ.. పొలిటికల్ మర్డర్ అని జగన్ కలరింగ్ ఇచ్చారని షర్మిల అన్నారు. రాష్ట్రంలో వరదలతో రైతుల అల్లాడుతున్నారనీ.. అసెంబ్లీలో ఉండాల్సిన మీరు ఢిల్లీ వెళ్ళడం ఏమిటి? అని ప్రశ్నించారు.