ఇవాళ పిఠాపురంలోని చిత్రాడలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ జరగనుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లను ఆ పార్టీ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యవేక్షణలో పూర్తిచేశారు. పార్టీ చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మ.3 గంటలకు మంగళగిరి నుంచి బయలుదేరనున్నారు. 3.45 గంటలకు సభా స్థలికి చేరుకొని శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రాత్రికి కాకినాడలోని జేఎన్టీయూ గెస్ట్ హౌజ్‌లో బస చేస్తారు.
సభా ప్రాంగణానికి వచ్చే మార్గాల ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. కాకినాడలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి సభ మానిటరింగ్ చేస్తారు. దానికి ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు వీవీఐపీలు, వీఐపీల కోసం ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేశారు. 250 మంది డయాస్‌పై ఉంటారు. వాహనాల పార్కింగ్‌కి ఐదు ప్రాంతాలను ఏర్పాటు చేశారు.. ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు సభ ప్రారంభమవుతుంది. పవన్ కల్యాణ్ ప్రసంగం 90 నిమిషాలు ఉంటుందని చెబుతున్నారు. ప్రభుత్వంలో భాగస్వామ్యమైన తర్వాత జనసేన సాధించిన విజయాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్లడమే ఈ సభ ఉద్దేశం అంటున్నారు పార్టీ నేతలు.