జనపార్టీ ఆవిర్భావ వేడుకలను ఈసారి పిఠాపురంలో నిర్వహించాలని జనసేన పార్టీ అధ్యక్షులు, ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిర్ణయించినట్లు జనసేన పార్టీ ఎమ్మెల్సీ పి.హరిప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ 100 శాతం స్ట్రెయిక్ట్తో ఘన విజయం సాధించిన తర్వాత తొలి సభ నిర్వహిస్తున్నట్లు, అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు.