Jana Sena : నేటి నుంచి జనసేన పార్టీ సభ్యత్వ నమోదు

Update: 2024-07-18 05:36 GMT

జనసేన పార్టీ నాలుగో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇవాళ్టి నుంచి ఈనెల 28 వరకు జరగనుంది. కొత్త సభ్యత్వ నమోదుతో పాటు సభ్యత్వ రెన్యువల్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. సభ్యత్వం పొందే ప్రతీ ఒక్కరికి ప్రమాద, జీవిత బీమా అందించనున్నట్లు పేర్కొంది. ఈ ప్రోగ్రామ్‌ను నేడు ఉ.10కి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించనున్నారు. గత ఏడాది దాదాపు ఆరున్నర లక్షల మంది జనసేన పార్టీ క్రీయాశీలక సభ్యులుగా చేరారు. ఈ ఏడాది పది లక్షల మందికి పార్టీ సభ్యత్వం కల్పించాలని పార్టీ నిర్ణయించింది.

ఎన్నికల అనంతరం మొదటిసారిగా పార్టీ మొదలుపెట్టిన కార్యక్రమం క్రియాశీలక సభ్యత్వ నమోదు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ 100 శాతం స్ట్రైక్‌ రేటుతో విజయం సాధించిన తరుణంలో ప్రజల్లో విశేషమైన ఆదరాభిమానాలు ఉన్నాయి. ప్రజలు పవన్‌కల్యాణ్‌ నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా ప్రజల మద్దతు స్వచ్ఛందంగా అందుతోంది. ఇలాంటి సమయంలో పార్టీని వారికి మరింత దగ్గర చేయాల్సిన అవసరం ఉంది’ అని మనోహర్‌ పేర్కొన్నారు.

Tags:    

Similar News