జనసేన నేతల కదలికలపై పోలీసుల దృష్టి

Update: 2023-08-07 06:51 GMT

పవన్ వారాహి యాత్ర నేపథ్యంలో విశాఖలో జనసేన నేతల కదలికలపై పోలీసులు దృష్టిపెట్టారు. జనసైనికులు ఎక్కడికి వెళ్లినా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. రుషికొండలోని వెంకటేశ్వర ఆలయానికి వెళ్లే ప్రయత్నం చేసిన జనసైనికులను అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొండ దిగువనే కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక దైవ దర్శనాన్ని అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు కొంత మంది జనసేన కార్యకర్తలు పోలీసుల కళ్లుగప్పి కొండపైకి చేరుకున్నారు. అన్ని మార్గాల్లో చెక్ పోస్టులు పెట్టి జనసైనికులను అడ్డుకున్నప్పటికి.. జనసేన భీమిలి ఇన్‌ఛార్జ్‌ పంచకర్ల సందీప్ కొండపైకి రావడంతో పోలీసులు ఖంగుతున్నారు. వెంటనే అప్రమత్తం అయిన పోలీసులు.. కొండపైకి రాకుండా అన్ని మార్గాలు మూసివేశారు. ఇక పోలీసుల చర్యలతో సామాన్యుల తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే తప్పేంటని జనసేన నేతలు పోలీసులపై మండిపడ్డారు. విశాఖలో భూకబ్జాలు పెరిగిపోతున్నాయని.. నిబంధనలకు విరుద్ధంగా రుషికొండను తవ్వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News