జోగి రమేశ్ బండారం బట్టబయలు.. వైసీపీ ఫేక్ ప్రచారం స్టార్ట్..

Update: 2025-10-16 06:01 GMT

ఏపీలో కల్తీమద్యం మరకలు వైసీపీ నేతలకు అంటుకుంటున్నాయి. ఒక్కొక్కరి బండారం బయట పడుతోంది. తమకు అసలేం సంబంధం లేదు అన్నట్టు మొన్నటి వరకు కవరింగులు ఇచ్చారు. ఒట్లు వేసి సింపతీ డ్రామా ఆడారు. కానీ ఇప్పుడు సాక్ష్యాలు బయట పడుతుండటంతో వైసీపీకి మొదటి నుంచి అలవాటు అయిన ఫేక్ ప్రచారానికి తెర తీస్తోంది. ఈ కల్తీమద్యం కేసులో ఏ1గా ఉన్న జనార్ధన్ రావుతో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ వాట్సాప్ చాటింగ్ ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఇద్దరూ కల్తీ మద్యం గురించి, ఆఫ్రికా టూర్ గురించి తరచూ వాట్సాప్ లో చేసుకున్న చాట్ మొత్తం పోలీసుల చేతికి చిక్కినట్టు తెలుస్తోంది. దీంతో వైసీపీ నేతల గుండెల్లో గుబులు మొదలైంది.

ఇంకోవైపు అప్రూవల్ గా మారిపోయిన జనార్థన్ రావు పోలీసుల సమక్షంలో జరిగింది మొత్తం వాంగ్మూలం ఇచ్చాడు. తనకు వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ అండ ఉండటం వల్లే ఇద్దరూ కలిసి చేసిన కల్తీమద్యం దందా గురించి కంప్లీట్ డీటేయిల్స్ బయట పెట్టేశారు. దీంతో జోగి ఉచ్చులో చిక్కుకున్నారు. ఇంకేముంది మళ్లీ వైసీపీ హైకమాండ్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం ఫేక్ ప్రచారం మొదలు పెట్టేశారు. తనకు అసలు జనార్ధన్ రావుతో ఎలాంటి సంబంధం లేదని.. తాను సత్యహరిశ్చంద్రుడిని అన్న రేంజ్ లో బిల్డప్ ఇచ్చేస్తున్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. ఎలాంటి లై డిటెక్టర్ టెస్టుకు అయినా రెడీ అనేస్తున్నారు ఈ వైసీపీ లీడర్.

కళ్ల ముందు సాక్ష్యాలు కనిపిస్తున్నా సరే ఇంత ఓపెన్ గా అబద్దాలు చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు కూటమి నేతలు. నేరం జరిగిందని ఆరోపణలు వస్తేనే టీడీపీ నేత జయచంద్రారెడ్డిని సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కానీ సాక్ష్యాలతో దొరికిపోతున్నా సరే వైసీపీ నేతలను కాపాడేందుకు మాజీ సీఎం జగన్ చేయిస్తున్న ఫేక్ ప్రచారాలు అందరికీ తెలిసిపోతున్నాయి. ఈ విషయంలోనే సీఎం చంద్రబాబు నాయుడుకు, జగన్ కు ఎంత తేడా ఉందనేది తెలిసిపోతోంది. ఇంత వరకు జగన్ తప్పులు చేస్తున్న తన పార్టీ నేతలను ఎలా కాపాడాలి అనేదే ఆలోచిస్తారే తప్ప.. తప్పు చేస్తే యాక్షన్ తీసుకోవడం అనేది తన డిక్షనరీలోనే లేదని మరోసారి జోగి రమేశ్ విషయంలో బయట పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ కేసులో నిందితులను కస్టడీకి ఇచ్చారు. కాబట్టి మరిన్ని సాక్ష్యాలు బయటకు వస్తే అప్పుడు ఏం చెబుతారో చూడాలి.


Full View

Tags:    

Similar News