ACB COURT: చంద్రబాబు బెయిల్‌పై సోమవారం తీర్పు

Update: 2023-10-06 10:00 GMT

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే.. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు ముగిసిన అనంతరం న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదిస్తూ బ్యాంకు ఖాతాల వివరాలు తెలుసుకోవాల్సి ఉందని.. చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని కోరారు. అనంతరం చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే వాదనలు వినిపించారు. స్కిల్ కేసులో ఇప్పటికే 13 మంది బెయిల్ పై ఉన్నారని వాదించామని చంద్రబాబు తరఫు న్యాయవాది తెలిపారు. స్కిల్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారన్నారు. స్కిల్ కేసులో చంద్రబాబు పాత్ర ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఇప్పటికే ఒకసారి చంద్రబాబును పోలీసు కస్టడీకి ఇచ్చారని.. రెండోసారి ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాదనలు విన్న న్యాయస్థానం తీర్పు సోమవారం వెలువరిస్తామని తెలిపింది.

Tags:    

Similar News