AP High Court : ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ బట్టు దేవానంద్ ప్రమాణం
ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ బట్టు దేవానంద్ ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ ఆయనతో ప్రమాణం చేయించారు. జస్టిస్ బట్టు దేవానంద్ రాకతో ఏపీ హైకోర్టులో జడ్జిల సంఖ్య 29కి చేరింది. ఏపీ హైకోర్టులో ఆయన 4వ స్థానంలో కొనసాగుతారు. జస్టిస్ దేవానంద్ పదవీ కాలం 2028 ఏప్రిల్ 13 వరకు ఉంది.