Somi Reddy: కాకాణి గోవర్ధన్‌రెడ్డి అవినీతిని బయటపెడతా - సోమిరెడ్డి

Update: 2025-09-11 12:55 GMT

టీడీపీపై విమర్శలు చేయడమే మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పనిగా పెట్టుకున్నారని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. నెల్లూరులో జరుగుతున్న సాగరమాల నేషనల్ హైవే పనులు అద్భుతంగా సాగుతున్నాయని ఆయన తెలిపారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డి భూ దోపిడీని త్వరలో ఆధారాలతో సహా బయటపెడతానని హెచ్చరించారు. కోర్టు తీర్పును పట్టించుకోని ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబుపై ఆరోపణలు చేసే అర్హత కాకాణికి లేదన్నారు.

వైసీపీ నేతలు లిక్కర్ స్కామ్‌లో రూ.3 వేల కోట్లు దోచుకున్నారని సోమిరెడ్డి ఆరోపించారు. అనంతపురంలో ఇటీవల నిర్వహించిన ‘సూపర్ సిక్స్.. సూపర్‌ హిట్‌’ సభను ప్రజలు విజయవంతం చేశారని సోమిరెడ్డి తెలిపారు.

Tags:    

Similar News