ఐదేళ్ల వైసిపి పాలనలో విసిగిపోయిన ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన నమ్మకాన్నిచ్చిందని ప్రభుత్వ విప్ రాయదుర్గం శాసనసభ్యులు కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో రాయదుర్గం నియోజకవర్గం లో 85% ఇంటింటికి వెళ్లి ప్రతి కుటుంబంతో మమేకమై వారికి అందుతున్న సంక్షేమ పథకాలపై ఆరా తీసినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. అధికార ఆర్భాటానికి దూరంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించడం గొప్ప విషయం అని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున ప్రజాదరణ లభిస్తుందని పేర్కొన్నారు. పెరిగిన పెన్షన్లు, తల్లికి వందనం పథకాలు నిరుపేదల పాలిట వరంగా మారాయన్నారు. త్వరలో అన్నదాత సుఖీభవ ఆర్టీసీ ఉచిత ప్రయాణం పథకాలు అమలు కానున్నట్లు తెలిపారు.