Kalyan Ram: చంద్రబాబుకు జరిగిన అవమానంపై కళ్యాణ్ రామ్ స్పందన..
Kalyan Ram: చంద్రబాబుకు జరిగిన అవమానంపై కళ్యాణ్ రామ్ స్పందించారు.;
Kalyan Ram: చంద్రబాబు కుటుంబానికి జరిగిన అవమానంపై నందమూరి కళ్యాణ్ రామ్ కూడా స్పందించారు. అసెంబ్లీ అనేది దేవాలయం అని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాటుపడేదని చెప్పారు. అలాంటి గొప్ప ప్రదేశంలో రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి గురించి వ్యక్తిగతంగా మాట్లాడడం తనను ఆవేదనకు గురించేసిందన్నారు.
మహిళలను గౌరవించడం మన సాంప్రదాయం అని చెప్పారు. అసెంబ్లీలో మహిళలను ఏ కారణం లేకుండా దూషించే పరిస్థితి రావడం దురదృష్టకరం అన్నారు. అందరూ హుందాగా నడుచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇదే సమస్యపై నందమూరి కళ్యాణ్ రామ్‌తో పాటు జూ.ఎన్‌టీఆర్ కూడా ప్రత్యేకంగా స్పందించారు.
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) November 20, 2021