ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా చవితి ఉత్సవాలు జరిపి తీరతాం: కన్నా లక్ష్మీనారాయణ
ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా వినాయక చవితి ఉత్సవాలు జరిపి తీరతామన్నారు కన్నా లక్ష్మీనారాయణ.;
ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా వినాయక చవితి ఉత్సవాలు జరిపి తీరతామన్నారు కన్నా లక్ష్మీనారాయణ. మొహర్రం, వైఎస్ వర్థంతి, సభలకు అనుమతి ఇచ్చినట్టే 50 మందితో పండగకు అనుమతివ్వాలన్నారు. చవితి ఉత్సవాలకు ప్రభుత్వం నంచి అనుమతి ఇప్పించాలంటూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కోరారు. గతేడాది కరోనా కారణంగా ఉత్సవాల్లేవని, ఇప్పుడు కేసులు తగ్గాయి కాబట్టే డిమాండ్ చేస్తున్నామన్నారు. జగన్ ప్రభుత్వంలో హిందూ మతం, దేవుళ్లపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఏపీలో 150కి పైగా ఘటనలు జరిగితే ఒక్కరినీ అరెస్ట్ చేయలేదన్న కన్నా లక్ష్మీనారాయణ.. వినాయక చవితిని ఇంట్లోనే చేసుకోండంటూ జీవో ఇవ్వడాన్ని ఖండిస్తున్నామన్నారు.