ఏపీలో జంపింగ్ రాజకీయం నడుస్తోంది. పార్టీ మార్పుపై ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి స్పందించారు. తాను పార్టీ మారడం లేదని..కావాలనే కొందరు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తన రాజకీయ ప్రయాణం చివరి వరకు వైఎస్‌ఆర్ కుటుంబంతోనే ఉంటుందని తెలిపారు కేతిరెడ్డి.
మరోవైపు.. బాలినేని, ఉదయభాను పార్టీని వదిలి వెళ్లడంతో వైసీపీలో గందరగోళం కనిపిస్తోంది. వైసీపీని వీడుతున్న నేతలు జనసేనలోకి చేరుతుండటం ఆసక్తి రేపుతోంది