TDP Office Attack : టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో లొంగిపోయిన నిందితుడు

Update: 2024-10-15 01:45 GMT

టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ప్రధాన నిందితుడు పానుగంటి చైతన్య లొంగిపోయాడు. వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న చైతన్య మంగళగిరి కోర్టులో లొంగిపోయాడు. టీడీపీ ఆఫీస్‌పై దాడిలో చైతన్య ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం రాగానే చైతన్యం అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి ప్రధాన అనుచరుడిగా చైతన్య ఉన్నాడు.

గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కేంద్ర కార్యాలయంతో పాటు చంద్రబాబు నివాసంపై దాడులు జరిగాయి. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినా చెల్లుతుందనే ఉద్దేశంతో వైసీపీ నేతలు దాడి చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో కేసును వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి అప్పగించించినట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ దాడి కేసులో వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, దేవినేని అవినాష్ పోలీసుల ఎదుట విచారణకు ఇవాళ హాజరయ్యారు. మంగళగిరిలో ఉన్న గ్రామీణ పోలీసు స్టేషన్‌లో ఈ ముగ్గురు వైసీపీ నేతలను పోలీసులు విచారించారు. దాడులు జరిగిన రోజు వీరు ముగ్గురు ఎక్కడ ఉన్నారు? ఎవరిని కలిశారు? ఎక్కడెక్కడ కలిశారనే విషయాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. 

Tags:    

Similar News