AP : గన్నవరంలో జగన్మోహన్ రెడ్డి.. ఈ మధ్యాహ్నం కీలక మీటింగ్

Update: 2024-06-01 06:45 GMT

కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలోని తన ఇంటికి చేరుకున్నారు ఆపద్ధర్మ సీఎం జగన్ మోహన్ రెడ్డి. విదేశీ పర్యటన ముగించుకుని శుక్రవారం రాత్రి గన్నవరం వచ్చిన జగన్ కు ఘనస్వాగతం లభించింది.

సీఎం జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటన సక్సెస్ ఫుల్ గా ముగిసిందని పార్టీ తెలిపింది. లండన్ నుంచి రాష్ట్రానికి చేరుకున్న సీఎం కుటుంబానికి పార్టీ నేతలు, అభిమానులు ఘనంగా స్వాగతించారు. గన్నవరం ఎయిర్ పోర్టులో పుష్పగుచ్చాలు ఇచ్చి వెల్కమ్ చెప్పారు. వారిలో ఎంపీలు విజయసాయిరెడ్డి, నందిగం సురేష్ ,మంత్రులు జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ,కారుమూరి నాగేశ్వరరావు, మేరుగ నాగార్జున,కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ , వెలంపల్లి శ్రీనివాసరావు, కైలే అనీల్ కుమార్ , ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి,టిజె.సుధాకర్ బాబు,కోన రఘుపతి,ముదునూరి ప్రసాదరాజు,శిల్పా చక్రపాణిరెడ్డి,

రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, రుహుల్లా,మొండితోక అరుణ్ కుమార్, మైలవరం ఎమ్మెల్యే అభ్యర్ధి సర్నాల తిరుపతిరావు, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే అభ్యర్ధి షేక్ ఆసిఫ్,గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే అభ్యర్ధి నూర్ ఫాతిమా, ఏలూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్ధి కారుమూరి సునీల్ ఉన్నారు.

ఈ మధ్యాహ్నం తాడేపల్లిలోని తన నివాసంలో పార్టీ నేతలతో కీలక సమావేశం ఏర్పాటుచేశారు జగన్. ఎగ్జిట్ పోల్స్ వచ్చినా ఎవరు తొందరపడొద్దని.. కౌంటింగ్ జరిగిన తర్వాతే స్పందించాలని పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఫలితాల సరళిని బట్టి ఎప్పుడెలా రియాక్ట్ అవ్వాలనేదానిపై చర్చించనున్నారు.

Tags:    

Similar News