AP Municipal Elections: కొండపల్లిలో వైసీపీ, టీడీపీకి సమాన ఓట్లు.. ఇండిపెండెంట్ అభ్యర్ధి చేతిలో నిర్ణయం..
AP Municipal Elections: కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపాలిటిలో కౌంటింగ్ ముగిసింది.;
AP Municipal Elections: కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపాలిటిలో కౌంటింగ్ ముగిసింది. మొత్తం 29 వార్డులకు ఫలితాలు వెల్లడయ్యాయి. టీడీపీ 14 చోట్ల, వైసీపీ 14 వార్డుల్లో విజయం సాధించాయి. ఒక వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. ఇండిపెండెంట్ అభ్యర్ధి... టీడీపీకి మద్దతు పలికారు. దీంతో మొత్తం 15 వార్డుల్లో టీడీపీ ఆధిపత్యం సాధించింది. మరోవైపు ఒకటో వార్డులో రీకౌంటింగ్‌కు పట్టుబడుతోంది టీడీపీ. ఈ వార్డులో ముందు... టీడీపీ గెలిచినట్లు ప్రకటించిన అధికారులు... ఆ తర్వాత రీకౌంటింగ్‌లో వైసీపీ గెలిచినట్లు ప్రకటించారు.