Krishna District Police : డ్రోన్ తో ఆకతాయిల ఆట కట్

Update: 2025-07-01 09:00 GMT

విద్యాలయాల వద్ద వేధింపులకు పాల్పడుతున్న ఆకతాయిల ఆటకట్టిస్తున్న కృష్ణాజిల్లా పోలీసులు. ఎస్పీ శ్రీ ఆర్ గంగాధరరావు ఆదేశాల మేరకు డ్రోన్ కెమెరాలతో విద్యాలయాలు కళాశాల వద్ద పటిష్ట భద్రత చర్యలను చేపట్టారు కృష్ణా జిల్లా పోలీసులు. కళాశాల ముగించుకొని విద్యార్థులందరూ బయటకు వస్తున్న సమయంలో అక్కడ కొంతమంది ఆకతాయిలు ద్విచక్ర వాహనాలతో అటు ఇటు వేగంగా పయనిస్తూ విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది.అక్కడే ఉన్న శక్తి టీం సభ్యులు ద్విచక్ర వాహనాలపై ఉన్న 7 గురు యువకులను అదుపులోనికి తీసుకొని వారిని విచారించగా వారు ఆ విద్యాసంస్థకు చెందినవారు కాదని తెలుసుకున్నారు. వారి తల్లిదండ్రులను పిలిపించి వారి కౌన్సిలింగ్ నిర్వహించి జరిమానా విధించి ఇంకొకసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Tags:    

Similar News