Kuna Ravikumar: టీడీపీ నేత కూన రవికుమార్‌ అరెస్ట్.. పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత..

Kuna Ravikumar: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల పోలీస్‌స్టేషన్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది.‌

Update: 2021-11-21 09:15 GMT

Kuna Ravikumar (tv5news.in)

Kuna Ravikumar: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల పోలీస్‌స్టేషన్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది.‌ కూన రవికుమార్‌ను విడుదల చేయాలంటూ టీడీపీ శ్రేణులు బైఠాయించాయి. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఆయన ఇంటికి వెళ్లిన ఎచ్చెర్ల పోలీసులు.. తలుపులు పగులగొట్టి అదుపులోకి తీసుకున్నారు. టుటౌన్‌ సీఐ ప్రసాదరావుపై దుర్బాషలాడారంటూ కూన రవికుమార్‌పై కేసు నమోదు చేశారు. నిరసనల సందర్భంగా ఉదయమంతా రవికుమార్‌ను పోలీసులు గృహనిర్బంధం చేశారు.. ఇది జరిగిన కొద్ది గంటల తర్వాత కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశం అయింది.

కూర రవికుమార్‌ అరెస్టును టీడీపీ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అక్రమ అరెస్టులకు నిరసనగా స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు రోడ్డెక్కారు. పోలీస్‌ స్టేషన్‌ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. కూన రవిని వెంటనే విడుదల చేయాలని పట్టుపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు టీడీపీ కార్యకర్తలు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం.. కూన రవికుమార్‌ను వైద్యపరీక్షల కోసం రిమ్స్‌కు తరలించారు పోలీసులు.

మరోవైపు కూన రవి అరెస్టును టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఖండించారు. వరదలతో రాయలసీమ జిల్లాలు కకావికలం అవుతుంటే ముఖ్యమంత్రి కక్షసాధింపు చర్యల్లో బిజీ అయిపోయారంటూ ఎద్దేవా చేశారు. అర్థరాత్రి యుద్ధ వాతావరణం సృష్టించి కూన రవికుమార్‌ను అరెస్టు చేశారని లోకేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు.. అచ్చెన్నాయుడు.. జగన్‌పై నిప్పులు చెరిగారు. అరెస్టులపైనే శ్రద్ధ.. జనం ఏమైనా పట్టదంటూ విమర్శించారు.

Tags:    

Similar News